బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై మంత్రి అనుచరుల దాడి?

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై మంత్రి అనుచరుల దాడి?

సహించేదిలేదన్నఎమ్మెల్సీ కవిత

మనోరంజని న్యూస్ ప్రతినిధి

నాగర్ కర్నూలు జిల్లా: ఫిబ్రవరి 28
నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు గురువారం రాత్రి వీరంగం సృష్టించారు. మండలంలోని సాతా పూర్‌లో ఫ్లెక్సీలు కడుతున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికిపాల్పడ్డారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం కొల్లాపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దకొత్తపల్లి మండలంలోని సాతా పూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పా టుచేస్తున్నారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అనుచరులు వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకుడు, కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ గుజ్జల పర మేశ్‌పై దాడికి పల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం గురువారం రాత్రి డిశ్చార్జ్‌ అయ్యారు.

పరమేశ్‌ను ఈరోజు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరిం చారు. దాడి సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్ప టికీ చోద్యం చూస్తూ ఉండి పోయారని ఆరోపించారు.

  • Related Posts

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని గోపాల్ పేట్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదాలలో ఒకరికి తీవ్రగాయాలు అయినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు పోలీసులు…

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు జెత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన కేసు ఇప్పటికే సస్పెండ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు మనరంజని రంగారెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.