ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంకై కృషి చేద్దాం

ఎన్ హెచ్ ఆర్ సి. నేషనల్ జనరల్ సెక్రెటరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపు

ఘనంగా గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నాయకుల సమావేశం

మనోరంజని ప్రతినిధి మార్చి 28 :- కోఠి (హైదరాబాద్) : ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ జనరల్ సెక్రెటరీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ కోఠి లోని బీసీసీఇ సమావేశ మందిరంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మిడాల మురళి అధ్యక్షతన జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న తమ సంస్థలో విద్యావంతులు, మేధావులు భాగస్వాములు కావడం హర్షిస్తున్నామని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి పెన్ను పేపర్ ద్వారా అవినీతి రహిత సమాజం కోసం రాజీలేని ఉద్యమ కార్యచరణ రూపొందించామని ఆయన అన్నారు. నేషనల్ కన్వీనర్ ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలలో తమ సంస్థ బలమైన నిర్మాణం చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాముల నారాయణ మాట్లాడుతూ ప్రతి మనిషి జ్ఞానం ద్వారా ఏదైనా సాధించవచ్చని జ్ఞానాన్ని మంచికి మాత్రమే ఉపయోగించుకోవాలని, చెడు మార్గాలకు ఉపయోగిస్తే అనర్ధాలు ఏర్పడతాయని, మనిషికి ఇతర జంతువులకు తేడా ఉండదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాల్మీకి శోభారాణి, ప్రధాన కార్యదర్శి వీరమల్ల రామ్మూర్తి, ఉపాధ్యక్షులు ఈశ్వర్ రావు, మేడ్చల్, యాదాద్రి, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల అధ్యక్షులు మర్రపు నాగార్జునరావు, ముక్కెర్ల బిక్షపతి, విసంపెల్లి నగేష్, చారగొండ బాబు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, ఐడి కార్డ్స్ వింగ్ ఆవునూరి కిషోర్, యాదాద్రి జిల్లా అధికార ప్రతినిధి మందుల శ్రీకాంత్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఖైరతాబాద్ డివిజన్స్ అధ్యక్షులు కళ్యాణ్, మమత, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలువురికి నియామక పత్రాలు అందించారు.
రాష్ట్ర కమిటీ సభ్యులుగా: అస్మత్ ఉన్నిసా, లయన్ మురళీ మనోహర్

గ్రేటర్ హైదరాబాద్ కమిటీ
అధికార ప్రతినిధిగా: ఎస్ వి సురేష్ రెడ్డి
ఉపాధ్యక్షులుగా: అర్జున్ సింగ్
సంయుక్త కార్యదర్శిగా: టి లావణ్య

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీలో స్వప్న, సంగీత, సునీత, ఉషారాణి తదితరులకు స్థానం కల్పిస్తూ నియామక పత్రాలు అందజేశారు.

  • Related Posts

    కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పంతులు శ్రీనివాస్‌కు ఘన సన్మానం

    కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పంతులు శ్రీనివాస్‌కు ఘన సన్మానం మనోరంజని ప్రతినిధి కామారెడ్డి ఏప్రిల్ 09 :- కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో, కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా పంతులు శ్రీనివాస్ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.…

    భైంసా గణేష్ నగర్‌లో నీటి ట్యాంకుల అస్వచ్ఛతపై ఆరోపణలు

    భైంసా గణేష్ నగర్‌లో నీటి ట్యాంకుల అస్వచ్ఛతపై ఆరోపణలు నిర్మల్ జిల్లా భైంసా పట్టణం గణేష్ నగర్‌లో నీటి ట్యాంకుల సమస్య వార్డు నంబర్ 10, 23లో మూడు నెలలుగా శుభ్రపరిచే పని లేదు బ్లీచింగ్ పౌడర్ వేయకపోవడంతో స్థానికుల ఆరోగ్యంపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పంతులు శ్రీనివాస్‌కు ఘన సన్మానం

    కిసాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పంతులు శ్రీనివాస్‌కు ఘన సన్మానం

    భైంసా గణేష్ నగర్‌లో నీటి ట్యాంకుల అస్వచ్ఛతపై ఆరోపణలు

    భైంసా గణేష్ నగర్‌లో నీటి ట్యాంకుల అస్వచ్ఛతపై ఆరోపణలు

    పోషన్ పఖ్వాడా (పోషణ పక్షం) పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

    పోషన్ పఖ్వాడా (పోషణ పక్షం) పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

    బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయండి ..

    బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయండి ..