

పోరాడదాం రండి.. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం భేటీ
TG: రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజ`పాటు లోక్సభ ఎంపీలకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్ర రుణ భారం తగ్గించుకోవడం, కేంద్రం నుంచి పన్నుల వాటా పెంపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్పై చర్చించనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణను రూపొందిస్తారు.