పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 4వేల కుటుంబాలకు రంజాన్ తోఫా

మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : షాద్ నగర్ నియోజకవర్గంపై నిత్యం ఆ అల్లా దయ ఉండాలని
కుల మతాలకు అతీతంగా జరుపుకునే రంజాన్ పండుగ భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు ప్రశాంతంగా జరుపుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన పలువురు పేద ముస్లింలకు రంజాన్ తోఫా కింద నిత్యవసర వస్తువులను అందజేశారు. రంజాన్ పండుగ రోజున ప్రత్యేక వంటకం అయిన “శీర్ ఖుర్మా” కు సంబంధించిన నిత్యవసర వస్తువులను పేదలకు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు వేల మందికి రంజాన్ తోఫా అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా షాద్ నగర్ పట్టణంలో 1500 మంది ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా తాను ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. రంజాన్ తోఫాను పేద మహిళలకు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. తను గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది రంజాన్ పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు రంజాన్ తోఫాను అందజేస్తున్నట్లు తెలిపారు. పవిత్రమైన రంజాన్ దినాన శీర్ ఖుర్మా వంటకం ప్రత్యేకమని, దీనిని ప్రతి ఒక్కరు సేవిస్తారని మతసామరస్యంతో అన్ని వర్గాలు సేమియా పాయసాన్ని తింటాయని పేర్కొన్నారు. పండగపూట నిరుపేద మహిళలు ఎవరు పస్తులు ఉండకూడదు అన్న మంచి ఉద్దేశంతో తన వంతు సాయంగా రంజాన్ తోఫాను ప్రత్యేకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఏడాది కూడా అన్ని మండలాల్లో తన వంతు సాయంగా రంజాన్ తుఫాను అందజేస్తామని తెలిపారు. నెల రోజులపాటు పవిత్ర రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాస దీక్షలు చేసి చివరగా అల్లాను ప్రసన్నం చేసుకోవడానికి జరుపుకునే ఈదుల్ ఫితర్
పండుగ ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఆర్థికంగా ఉన్నవారు ఈ మాసంలో పేదలకు జకాత్ ఇస్తారని పేర్కొన్నారు. తన వెంట రాజకీయంగా ఎంతోమంది మైనార్టీ నాయకులు వెంట ఉన్నారని వారు కూడా తమ పరిధిలో ఉన్న పేదలను పేరిట ఆదుకుంటారని, తాను చేస్తున్న దానధర్మాల్లో కూడా వారి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మైనార్టీ నేతలు మహమ్మద్ ఇబ్రహీం, జమ్రుత్ ఖాన్, సయ్యద్ ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, షర్ఫోదీన్, వీర్లపల్లి అన్వర్, కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు..

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే