

మనోరంజని ప్రతినిధి నిర్మల్ జిల్లా,మార్చి ౦౩ నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లి తండాలో నిన్న రాత్రి జరిగిన పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డాన్స్ విషయంలో శ్రీకర్, రాజు అనే ఇద్దరు యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ కాస్తా మరింత ముదిరి రాజు, శ్రీకర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో శ్రీకర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ప్రాథమిక వైద్యం కోసం తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.