

పెద్దపల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి: మార్చి 11 :- విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ప్రభుత్వ గురుకులాల్లో చదివే బాలికలకు నాణ్యమైన భోజనం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. మంగళవారం పెద్దపల్లిలోని రంగంపల్లిలో ఉన్న మహాత్మజ్యోతిభా ఫూలే బీసి బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు. బాలికల గురుకులంలో అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. పిల్లలతో మాట్లాడి భోజనం నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, విద్య బోధన వివరాలను ఆరా తీశారు. బీసీ బాలికల గురుకుల ప్రిన్సిపాల్ మణిదీప్తి ఉన్నారు.