

పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా 2డీ ఎకో సేవలు: కలెక్టర్
మనోరంజని ప్రతినిధి పెదపెల్లి మార్చి 11 – పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా 2డీ ఎకో సేవలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీ హర్షను పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో క్లినికల్ కార్డియాలజిస్ట్ గా రిక్రూట్ అయిన డాక్టర్ ప్రియాంక మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అన్న ప్రసన్న కుమారి ఉన్నారు