

*పలు టీలా కార్యక్రమాలకు హాజరయిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 05 :- ఉట్నూర్ పట్టణంలో గల JCN ఫంక్షన్ హాలులో జాధవ్ గణేష్ గోబ (టీచర్) గారి కుమారుడి టీలా కార్యక్రమం జరిగింది ఇట్టి కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మరియు మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరయి ఆశీర్వదించారు. అనంతరం ఇంద్రవెళ్లి మండలంలోని హర్కపూర్ తాండ గ్రామానికి చెందిన ప్రహ్లాద్ కరీం నాయక్ చౌహన్ గారి కుమారుడి టీలా కార్యక్రమం హర్కపూర్ తండాలో జరిగింది. ఇట్టి టీలా కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మరియు మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరయి ఆశీర్వదించారు. వీరి వెంట నాయకులు తిరుమల్ గౌడ్, రవీందర్ రెడ్డి, జాధవ్ భీంరావ్ నాయక్, రమేష్ జాధవ్, సిద్దార్త్ ససనే, దోమకొండ సుధాకర్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.