

నియోజకవర్గానికి 1.12 కోట్ల ఈజిఎస్ నిధులు మంజూరు
ఏఎంసీ చైర్మన్ అనంద్ రావు పటేల్
ముధోల్ నియోజకవర్గంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఒక కోటి 12 లక్షల నిధులు మంజూరైనట్లు బైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేసిన నిధులతో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క- జిల్లా కలెక్టర్ అభిలాష ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం గ్రామాల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తుందని వెల్లడించారు. నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-మంత్రి సీతక్కకి ధన్యవాదాలు తెలిపారు.