

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 12 – నిజామాబాద్ జిల్లా కేంద్రం లో శివాజీ నగర్ లో గల రామకృష్ణా విద్యాలయంలో.. ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా ప్రత్యేక సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి.. జిల్లా కమిటీ సభ్యులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర మాట్లాడుతూ.. గత మూడు నెలల నుండి మన సమిష్టి కృషి నగరంలో ప్రచార రూపంలో మారిందని… ఇలాగే అందరూ ఏకతాటిపై ఉండి సమిష్టికి కృషి చేస్తే.. రాబోయే రోజుల్లో ఎన్ హెచ్ ఆర్ సి.. సరికొత్త రూపం దాల్చుతుందని. తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. ఎన్ హెచ్ ఆర్ సి.. సంపన్నుల గురించి గాక… బీద వారి గురించి ఎక్కువ పని చేస్తుందని.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎన్ హెచ్ ఆర్ సి.. తన పాత్ర నిర్వర్తిస్తుందని.. ప్రతి ఒక్కరూ కర్తవ్యం గా భావిస్తూ.. ఎన్ హెచ్ ఆర్ సి ముందుకు పోవడానికి.. ఈ సందర్భంగా తెలియజేశారు.. కొన్ని సందేహాలకు. రాష్ట్ర అధ్యక్షులు మొగుళ్ళ భద్రయ్య.. చరవాణి ద్వారా నివృత్తి చేశారు.. ఎన్ హెచ్ ఆర్ సి అంటే.. తనకోసం తాను పని చేసుకోకుండా.. ఇతరులకు గురించి కష్టపడాలని.. ఇతరుల కష్టాల్లో మనం సైతం భాగస్వామ్యం కావాలని.. చరవాణి ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.. మొగుళ్ళ భద్రయ్య గారు.. ఈ విషయానికి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు శ్రద్ధగా విన్నారు ఆచరిస్తామని చెప్పారు.. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు
