

తెలంగాణ హోం శాఖ మంత్రిగా విజయశాంతి..?
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 10 :-
తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి. టిఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బిజెపికి వెళ్లారు. బిజెపి రాజకీయాల నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెసులో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు.ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. సినిమాలలో పోలీస్ పాత్రలలో ఒదిగిపోయారు. నిజ జీవితంలో హోం శాఖ మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం క్యాబినెట్ విస్తరణ జరగనుంది. హోం శాఖ మంత్రిగా విజయశాంతికి అవకాశం కల్పిస్తారని సమాచారం.