తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం

తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 22 – తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం రాత్రి వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రంతా ఈదురుగాలులు, భారీ వడగళ్లతో భారీ వర్షం పడింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో అల్లకల్లోల వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ లో దాదాపు ప్రళయమే కనిపించింది. చాలా జిల్లాల్లో వరి, మొక్కజొన్న పంటలు తీవ్ర నష్టపోయాయి. మామిడి కాయలు నేలరాలాయి. కాగజ్ నగర్ లో గోడ కూలి ఓ వ్యక్తి మరణించాడు. ఊహించని విధంగా దాదాపు తుఫానులా వర్షం విరుచుకుపడింది. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. వర్షాలకు తోడు ఈదురు గాలులు బీభత్సమే సృష్టి స్తున్నాయి. చాలా జిల్లాల్లో పెద్ద చెట్టు కూడా నేలకూ లాయి. కరెంటు స్తంభాలు పక్కకు ఒరిగాయి. వర్షాకాలంలో కూడా ఈ స్థాయి వర్షాలు పడలేదు. అలాంటిది రాత్రి భారీగా కురిసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్ ఆ చుట్టు పక్కల జిల్లాలు ఉత్తర తెలంగాణ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా.. రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ, ధర్పల్లి, మండలం మద్దుల్ తండా, హొన్నాజిపేట్, వాడీ, గుడి తండాలో కొండూరు, న్యవ నంది రవుట్ల గ్రామాలలో ఈదురు గాలులతో వడ గండ్ల వానకు వరిగింజలు నేలరాలాయి. ఈదురు గాలులకు వరి పంట నాశనం అయిపోయింది. మరో రెండు రోజులు వర్షాలు ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ పరిస్ధితిని సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం