తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వర్షం..!!

తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వర్షం..!!

గత కొన్ని రోజులుగా ఎండ వేడిమికి తెలంగాణ ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 10 దాటితే భానుడి భగభగలకు భయపడి బయటకు రాలేకపోతున్నారు. ఇక అత్యవసర పనులపై వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకుని బయట అడుగుపెడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం కాస్త చల్లబడ్డారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్‌, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల వానకు నిజామాబాద్‌లోని ధర్పల్లి మండలంలో వరి ధాన్యం తడవగా.. కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి, రాజారం, తిమ్మాపూర్‌తోపాటు పలు గ్రామాల్లో పలుచోట్ల మామిడి తోటలో పూత, కాయలు రాలిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్‌లో భారీగా వడగండ్ల వాన కురిసింది. అయితే మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో విలవిలలాడని జనం ఒక్కసారిగా వర్షం కురవడంతో సంబురపడుతున్నారు. అయితే రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతకు వచ్చే సమయంలో వర్షాలు కురుస్తున్నాయని బాధపడుతున్నారు. ఈసారి కూడా పంట నష్టం తప్పదా భగవంతుడా అంటూ బిక్కుబిక్కుమంటున్నారు.

  • Related Posts

    స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం

    స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు తిరుమల అనంతరెడ్డి ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎక్కాల సిద్దయ్య మనోరంజని వెల్దుర్తి…

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 28 :- హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం

    స్వల్ప కాలిక రుణములు11 50 సభ్యులకు ఐదు కోట్ల 9 లక్షల 16 వేల 5వందల 79 రూపాయలను రుణమాఫీ చేశాం

    మయన్మార్ అతి భారీ భూకంపం

    మయన్మార్ అతి భారీ భూకంపం

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం

    ప్రతి ఒక్కరూ బాధ్యత గల భారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదాం