తెలంగాణకు మళ్లీ వర్ష సూచన..

తెలంగాణకు మళ్లీ వర్ష సూచన..

హైదరాబాద్: ఏప్రిల్ 2, 3,4 తేదీల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శుక్రవారం విడుదల చేసిన రోజువారీ వాతావరణ నివేదిక ప్రకారం.. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. అయితే, రాబోయే ఐదు రోజులు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.గత 24 గంటల్లో తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంది, గురువారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 36 – 41 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. కాగా ఇటీవల రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అకాల వర్షాల వల్ల పలు చోట్ల పంట నష్టం కూడా జరిగింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ నగరంలో ఎండ తీవ్ర కొనసాగుతోంది. శుక్రవారం ముషీరాబాద్‌లో అత్యధికంగా 40 డిగ్రీలు, షేక్‌పేట్‌లో 39.9, నాంపల్లిలో 39.9, ఖైరతాబాద్‌లో 39.9, అసిఫ్‌నగర్‌లో 39.9, చార్మినార్‌లో 39.9, బండ్లగూడలో 39.9, సైదాబాద్‌39.8, బహదూర్‌పురాలో 39.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే