

తిరుమలలో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం
మనోరంజని ప్రతినిధి తిరుపతి మార్చి ౦౩ ఆంధ్రప్రదేశ్ : తిరుమలలో నాలుగు సంవత్సరాల చిన్నారి అదృశ్యమైంది. దీక్షిత అనే నాలుగేళ్ల చిన్నారిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద నుంచి దీక్షితను ఆమె ఎత్తుకుపోయింది. దీక్షిత తల్లిదండ్రులు తిరుమలలోనే చిరు వ్యాపారం చేస్తున్నారు. వారి కూతురు అపహరణకు గురవ్వడంతో ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు