

టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎంకు మంత్రి సురేఖ లేఖ
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 11 :- టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎంకు మంత్రి సురేఖ లేఖ
టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంపై తీవ్ర గందరగోళం నెలకొంటుందని.. సీఎం ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. అధికారుల తీరుతో తెలంగాణ ప్రజాప్రతినిధులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ప్రత్యేకంగా పరిశీలించి టీటీడీ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు