జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

జర్నలిస్టులు, జర్నలిస్టుల సంక్షేమం ముసుగులో తమ సొంత ప్రయోజనాలు చక్కదిద్దుకుంటున్న వ్యక్తుల విషయంలో జర్నలిస్టు సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అన్నారు. కొన్ని సంఘాల ఏకచత్రాధిపత్య విధానాలకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూస్తున్న క్రమంలో, ఆ సంఘాల నేతలు
తమ ఏజెంట్ల ద్వారా వారిపై బురద జల్లించే ప్రయత్నం చేయడం తగదన్నారు. మంథని డివిజన్ కేంద్రంగా పాత్రికేయ మిత్రులు నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు వారిపై రాజకీయ ముద్ర వేసే ప్రయత్నాలను ఆయన
తీవ్రంగా ఖండించారు. సుదీర్ఘకాలం పాతుకుపోయిన సంఘం నేతలకు డివిజన్ స్థాయిలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు కావడం మింగుడు పడడం లేదన్నారు. జర్నలిస్టుల సంఖ్యా బలాన్ని చూపి అధికారిక అందలాలు పొందడమే తప్ప, గ్రామీణ జర్నలిస్టుల సమస్యలు ఏనాడు పట్టించుకోని సంఘ నేతలు వారికి వ్యతిరేకంగా సంఘటితం అవుతున్న జర్నలిస్టులను అణిచివేయడానికి రాజకీయాలను పావుగా ఉపయోగించుకోవడం తగదన్నారు. మంథని కేంద్రంగా నూతనంగా ఏర్పడిన డివిజనల్ ప్రెస్ క్లబ్
కాంగ్రెస్ పార్టీకి అనుబంధం అంటూ చేయిస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు.

జర్నలిజంలో రాజకీయాలను
వాడుకున్న ఘన చరిత్ర 60 ఏళ్లుగా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న సంఘానికే వర్తిస్తుందన్నారు.

అధికారంలో ఉన్నవారికి అంట కాగుతూ తమ ప్రయోజనాలను
కాపాడుకుంటున్న చరిత్ర ఎవరిదో
యావత్ తెలంగాణ జర్నలిస్ట్
సమాజానికి విధితమే అన్నారు.

మంథని డివిజన్ ప్రాంతంలో అస్తిత్వం దెబ్బతింటుందని,
తమ ప్రయోజనాలకు భంగకరంగా ఉంటుందని భావించే
జర్నలిస్టు సంఘానికి చెందిన కొందరు నేతలు ప్రతిపక్ష పార్టీల
ద్వారా అసత్య ప్రచారాలకు
పాల్పడుతున్నారని ఆరోపించారు.

ప్రెస్ క్లబ్ ల గుత్తాధిపత్య ధోరణులతో విసిగిపోయిన
మంథని డివిజన్ పరిధిలోని వివిధ మండలాల జర్నలిస్టులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకున్నారని, దీంతో
తమ ఏకచత్రాధిపత్యానికి
ఎక్కడ భంగం కలుగుతుందో
అనే భయంతో కొందరు
తమకు వ్యతిరేకంగా ఏకీకరణ అవుతున్న వారిపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని
అన్నారు.

గ్రామీణ జర్నలిస్టుల వ్యాపారాల
విషయాన్ని ప్రస్తావిస్తున్న వ్యక్తులు
నెలసరి వేతనాలు పొందుతున్న
జర్నలిస్టులు చేస్తున్న వ్యాపారాల విషయంలో నోరెత్తకపోవడం శోచనీయమన్నారు.ఈ

పనిచేస్తున్న సంస్థల నుండి వేతనాలు లేని పరిస్థితుల్లో, జర్నలిజమే వృత్తిగా బ్రతుకుతున్న వ్యక్తులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకోవాల్సిందే అన్నారు.
వాటిని తప్పు పట్టే వ్యక్తులు
వారికేమైనా ఉపాధి మార్గాలు చూపిస్తారా అని ప్రశ్నించారు.

జర్నలిజం, రాజకీయాలు అనేవి వేరువేరు కాదని, జర్నలిస్టులకు నిత్యం రాజకీయ వాదులతోనే
అనుబంధం ఉంటుందన్నారు.
అధికారంలో ఎవరు ఉన్నా, వారి వార్తలు రాయడం జర్నలిస్టుల పరమావధి అని, దానిని వక్రీకరించే విధంగా నూతనంగా ఏర్పడిన క్లబ్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధం అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.

జర్నలిస్టు సంఘాల ముసుగులో
ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న నేతల వైఖరికి నిరసనగా గ్రామీణ జర్నలిస్టులు సంఘటితం అవుతున్న క్రమంలో
వారిపై విషపూరిత ప్రచారం
చేయడం ద్వారా తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వ్యక్తులకు తగిన గుణపాఠం
చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే