జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన

జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన

మనోరంజని ప్రతినిధి జనగామ జిల్లా: మార్చి 16 – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవ్వాళ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పర్యటిం చారు. ఈ సందర్భంగా రూ. 800 కోట్ల అభివృద్ధి పను లకు సీఎం శంకుస్థాపనలు చేశారు. రూ.102.1 కోట్లతో మహిళాశక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘా లకు మంజూరు చేసిన ఏడు ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు అందజేశారు. వేదిక వద్ద వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ శివారు శివునిపల్లిలో ప్రజా పాలన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభలో దాదాపు 50 వేల మంది హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. వేసవి ఎండల నేపథ్యంలో సభా ప్రాంగణంలో జర్మన్‌ టెక్నాలజీ టెంట్లను వేశారు. ఈ సందర్భంగా నియోజ కవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ను ప్రారంభించారు. దీంతో పాటు.. రూ.12.9 కోట్లతో గోవర్ధనగిరి నుంచి చర్ల తండా వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.26 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ డివిజనల్‌ స్థాయి ఆఫీస్‌ కాంప్లెక్స్‌, రూ.45. 5 కోట్లతో ఘన్‌పూర్ లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు, రూ.5.5 కోట్లతో ఘన్‌పూర్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు వంటి పనుల్లో పాల్గొన్నారు.దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2లో భాగంగా రూ.148.76 కోట్లతో ఆర్‌ఎస్‌ ఘన్‌పూర్‌ ప్రధాన కాలువ సీసీ లైనింగ్‌ పనులు, రూ.25.6 కోట్ల వ్యయంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోకవర్గంలో 750 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు.

  • Related Posts

    Heavy Rains: ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..!!

    Heavy Rains: ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..!! Heavy Rains in Telangana:ఎండలు దంచికొడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 21 నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం…

    ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి

    ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 18 :- హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం నర్సింలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

    లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

    Heavy Rains: ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..!!

    Heavy Rains: ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..!!

    ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి

    ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి

    హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..!!

    హైదరాబాద్లో బంగారం ధర ఫస్ట్ టైం ఎంతకు పోయిందంటే..!!