గ్రామ గ్రామానికీ బీసీ వాదాన్ని తీసుకెళ్తాం..

  • గ్రామ గ్రామానికీ బీసీ వాదాన్ని తీసుకెళ్తాం..
  • కులగణన పత్రాలు తగులబెడితే సస్పెండ్‌ చేస్తారా?
  • ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్: బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే బీసీ నేతలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. బీసీలను కించపరిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుంచి గ్రామ గ్రామానికి బీసీ వాదాన్ని తీసుకెళ్తామని, బీసీ మేధావులతో చర్చించి భవిషత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీ జేఏసీతో కలిసి ముందుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని పత్రాలు తగులబెడితే తనను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా అని ప్రశ్నించారు.టీపీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నానంటూ తనను సస్పెండ్‌ చేయించారని ఆరోపించారు. తనను సస్పెండ్‌ చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోదన్నారు. ఈ సందర్భంగా ఫ్రేమ్‌లో పెట్టి ఇచ్చిన సస్పెన్షన్‌ కాపీని ప్రదర్శించారు. బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల రక్షణ కోసమే బీసీ జనాభా తగ్గించారన్నారు. 2028లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.కాంగ్రెస్‌ బతకాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచన లేదని ఈ సందర్భంగా చెప్పారు. సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు వట్టే జానయ్య యాదవ్‌, సంగెం సూర్యారావు, పి.సత్యం వంశరాజ్‌, గటిక విజయ్‌కుమార్‌, ఓదేలు యాదవ్‌, రజని తదితరులుపాల్గొన్నారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్