గోరు బోలి (లంబాడా) భాషకు గౌరవం – తెలంగాణ అసెంబ్లీ చారిత్రాత్మక నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా, నిర్మల్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ నేతృత్వంలో మామడ మండలంలో ఘన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే, ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామడ మండల్ ఇన్‌చార్జి అనిల్ రఫి, మాజీ జడ్పీటీసీ లింగారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ రాథోడ్ జైసింగ్, ఎంపీపీ రాథోడ్ సంతోష్, జడ్పీటీసీ బాపయ్య, వకీల్ సాగర్, ప్రేందాస్ రసమళ్ళ అశోక్, ప్రవీణ్, రత్నం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 08 :- రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా…

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం. *మనోరంజని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 08 :- మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం సుద్దాల గ్రామములో సీఎం రేవంత్ రెడ్డి, మరియు ఎమ్మెల్యే వివేక్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం