గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

గోదావరి, కృష్ణా పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు
ఇప్పటికే ప్రభుత్వానికి బడ్జెట్ అంచనాలు
గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభం
సరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు మంజూరు
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గోదావరి, కృష్ణా, సరస్వతి పుష్కరాలకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 170 స్నానఘాట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. అందుకోసం బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారులు పనులు ప్రారంభించనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత ప్రతిపాదికన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహా కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేవాదాయ, టూరిజం, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన పలువురు అధికారులు ఇటీవలే ప్రయాగ్ రాజ్ కు వెళ్లి కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించారు.

అక్కడి అధికారులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన నివేదికను సీఎం కార్యాలయానికి పంపించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఈ ఏడాది మహా సరస్వతి పుష్కరాలు రానున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు మహా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు సూచనలు ఇచ్చింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు రూ.25 కోట్లు మంజూరు చేసింది.

మహా కుంభమేళా తరహాలో ఏర్పాట్లు

2027లో గోదావరి, 2028లో కృష్ణా పుష్కరాలు రానున్నాయి. ఈ పుష్కరాలకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్ రాజ్ లో 45 రోజులపాటు విజయవంతంగా నిర్వహించిన మహా కుంభమేళాపై అధికారులతో ప్రభుత్వం సర్వే చేయించింది. రాష్ట్రం నుంచి ఎండోమెంట్, టూరిజం, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలకు చెందిన 10 మంది అధికారుల బృందం ఇప్పటికే ప్రయాగ్ రాజ్ లో పర్యటించింది.

అక్కడి అధికారులతో మాట్లాడి కుంభమేళా ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన నివేదికను రాప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం రెండేండ్ల ముందుగానే కుంభమేళా ఏర్పాట్లను ప్రారంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా నిర్వహించాలని చూస్తున్నది. ప్రభుత్వం నుంచి సిగ్నల్ రాగానే పుష్కరాలకు పనులు ప్రారంభించనున్నారు

  • Related Posts

    రేషన్ లబ్ధిదారులకు షాక్…

    రేషన్ లబ్ధిదారులకు షాక్… రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం తీసుకుందామనుకున్న రేషన్ లబ్ధిదారులకు డీలర్లు షాకిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో షాపులు ఓపెన్ చేయడం లేదు. మిగతా చోట్ల టైం పాటించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్ షాపులు ఎప్పుడు తీస్తారోనని…

    వరంగల్: మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై సమీక్ష

    వరంగల్: మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై సమీక్ష వరంగల్ జిల్లా కలెక్టరెట్లో సోమవారం మన ఊరు మనబడి – మన బస్తీ మన బడి పథకం కింద మంజూరు అయినా పనులు పెండింగ్ సమస్యలపై సంబంధిత ఇంజనీర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రేషన్ లబ్ధిదారులకు షాక్…

    రేషన్ లబ్ధిదారులకు షాక్…

    గత 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వానికి గర్వించదగిన అతిపెద్ద సాధన వక్ఫ్ సవరణ చట్టం

    గత 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వానికి గర్వించదగిన అతిపెద్ద సాధన వక్ఫ్ సవరణ చట్టం

    గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా..

    గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా..

    వరంగల్: మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై సమీక్ష

    వరంగల్: మన ఊరు మనబడి మనబస్తీ మనబడి అభివృద్ధి పనులపై సమీక్ష