గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 11 – తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని, గవర్నర్ ప్రసంగంతో తమకు సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. గడిచిన డిసెంబర్‌లో మొదటి సారి గవర్నర్ ప్రసంగంలోని అంశాల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద నెపం తెచ్చే ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై మాట్లాడాలన్నారు. అంతకు ముందు కాళేశ్వరం మీద అఖిల పక్షం టూర్ పెట్టారని.. ఇప్పుడు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామాల్లో ప్రభుత్వ పనితనంపై అఖిల పక్షం టూర్ పెట్టాలని.. తాము వస్తామని అన్నారు. ఫామ్ హౌస్‌లో పడుకున్న వాళ్ళ గురించి తాము మాట్లాడమని (పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరెంటు, నీళ్లు, విద్య, ఉద్యోగం, రైతాంగం, మహిళలు, నిరుద్యోగ యువత, సంక్షేమ పథకాలపై ప్రతి పక్ష పార్టీగా తామే మాట్లాడతామని అన్నారు. రాష్ట్రం విడిపోక ముందు రూ 800 కోట్లు ఉంటే 2014 తరువాత రూ. 5 వేల కోట్లకు కేటాయింపులు పెరిగాయన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక ఎన్ని వేల కోట్లు అప్పులు చేసారో సభలోనే చర్చిద్దామని అన్నారు..

  • Related Posts

    అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.

    అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 – నిర్మల్ జిల్లా -సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బి) అటవీ ప్రాంతంలో గురువారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. బెంగళూరు అసిస్టెంట్ డైరెక్టర్ సమత్ సర్వే నిర్వహించారు. మొక్కల…

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్‌లో ఉన్న వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో గురువారం ముందస్తు హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ పండుగ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.

    అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు