కెఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అభ్యాస సామాగ్రి అందజేత.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 12 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని జామ్ గ్రామానికి చెందిన కోర్వ నవీన్ రెడ్డి న్యాయవాది నెలకొల్పిన కొర్వ నవీన్ రామ క్రిష్ణ రెడ్డి ట్రస్ట్ (కెఎన్ఆర్) జాం/ హైదరాబాద్ గార్ల ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని జామ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు,ఇంగ్లీష్ డీ క్షణరీ లు అభ్యాస సామాగ్రి అందజేశారు..ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు జనార్ధన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య లు మాట్లాడుతూ..పాఠశాల అభివృద్ధిలో దాతల సహకారం కీలకమని,సమాజ భాగస్వామ్యంతో పాఠశాలలు ప్రగతి బాట పడతాయని అన్నారు.కాంగ్రెస్ నాయకులు కోర్వ నవీన్ రెడ్డి న్యాయవాది కెఎన్ఆర్ ట్రస్టు అందించిన సహకారంతో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను శ్రద్ధగా చదివి పది పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని తల్లి దండ్రులకు పాఠశాలకు మండలానికి మంచిపేరు తేవాలని సూచించారు.ముందుగా పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యం,మహేష్, లింగారెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

  • Related Posts

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు . మనోరంజని ప్రతినిధినిర్మల్ జిల్లా – సారంగాపూర్: మార్చి 13 :-నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో గురువారం హోలీ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు.…

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు జెత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన కేసు ఇప్పటికే సస్పెండ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు మనరంజని రంగారెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి

    వింధ్య స్కూల్‌లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ

    వింధ్య స్కూల్‌లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహణ