కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు?

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు?

ఈసారి రాములమ్మకు అవకాశం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 09- తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను భట్టి.. నాలుగు స్థానాలు రానున్నాయి.అయితే.. ఆ నాలుగింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించింది హస్తం పార్టీ. కాగా.. మిగతా ముగ్గరు అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేసిన కాంగ్రెస్ నాయకత్వం.. పేర్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా.. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. మూడు స్థానాల్లో ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీకి కేటాయించగా.. మరొకటి మహిళకు కేటాయిస్తూ.. అన్ని వర్గాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేసింది. అయితే.. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్‌తో రాష్ట్ర నాయకులు జరిపిన జూమ్ మీటింగ్‌తో అభ్యర్థులు ఫైన ల్ అయినట్టు తెలుస్తోంది. కాగా.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి, కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో ఉన్నవారికి కాకుండా.. పార్టీకి చాలా రోజులుగా విధేయంగా ఉన్నవారికి, కీలక వ్యక్తులకు ఈసారి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం

  • Related Posts

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కేంద్ర మంత్రి , తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ(ఆదివారం) ఏబీఎన్‌తో కిషన్‌రెడ్డి మాట్లాడారు. శాసన సభ సమావేశాలు అత్యంత హుందాగా జరగాలని…

    ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎలా?: సీఎం రేవంత్ రెడ్డి

    ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎలా?: సీఎం రేవంత్ రెడ్డి మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 16 – మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌,పై తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి,సెటైర్లు వేశారు. కేసీఆర్‌ వర్క్‌ ఫ్రమ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.