కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య

45 లక్షల ప్యాకేజితో ఉద్యోగం..అంతా సాఫి గా అనుకునే సమయంలో…కాచిగూడ టూ గిద్దలూరు …వెళ్ళాడు…అక్కడ గూడ్స్ పైకి ఎక్కి… కరెంటు హై టెన్షన్ వైరు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు… కారణం ఏంటో అనే కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు!

మనోరంజని ప్రతినిధి


ఆ వ్యక్తికి ఏమైందో.. ఏంటో..? తెలియదు..

కాచిగూడలో ట్రైన్ ఎక్కి గిద్దలూరు వెళ్లాడు.

అక్కడ ఓ గూడ్స్ రైలు పైకి ఎక్కి.. ఏకంగా హై టెన్షన్ వైర్లు పట్టుకున్నాడు…గాయపడ్డ అతనిని చూసిన
వెంటనే అధికారులు ఆస్పత్రికి తరలించారు.

తీవ్ర గాయాలైన అతడు..ఈ రోజు మరణించాడు…అసలు ఇలా ఎందుకు చేశాడు..!

ప్రకాశంజిల్లా

గిద్దలూరులో ఓ యువకుడు రైల్వే హై టెన్షన్ 25 కే.వీ వైర్లను పట్టుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయాడు.

ఆత్మహత్య చేసుకున్న యువకుడు చెన్నైలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫోర్త్‌ ఇయర్‌ చదువుతున్న ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట్ల అమర్నాథ్‌గా రైల్వే పోలీసులు గుర్తించారు.

45 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. ఆత్మహత్యకు ప్రేమే కారణమా..!

అమర్నాథ్ చెన్నైలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ యూనివర్సిటీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ 45 లక్షల ప్యాకేజీని అమర్నాథ్‌కు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. చేతికొచ్చిన బిడ్డ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు అమర్నాధ్‌ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందో అర్ధం కావడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అమర్నాధ్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్నారు. తాను ప్రేమించిన యువతితో పెళ్ళి జరగదన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

  • Related Posts

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు.. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు, ధరించిన ఆ దుండగుడు అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను…

    ఇది కదా పోలీసుల పవర్..

    ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు.. కత్తులు, కర్రలతో దాడి.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వస్త్రల్ ఏరియాలో గత కొద్ది రోజుల నుంచి రౌడీలు రెచ్చిపోతున్నారు. హోలీకి ఒకరోజు ముందు మార్చి 13వ తేదీన 20 మంది రౌడీలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.