

కరీంనగర్: దుండగులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి
మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 11 – జాతీయ మాల మహానాడు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాడే శంకర్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులూ ఎలుక అంజయ్య, దామెర సత్యం, రామస్వామిలు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం పైన చెప్పుల దండ వేసి అవమానపర్చిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని 2టౌన్ సిఐ సృజన రెడ్డికి పిర్యాదు పత్రం అందజేశారు. దుండగులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు