

కన్నుల పండువగ పోచమ్మ దేవాలయ వార్షికోత్సవం
మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 08 :- నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి గ్రామంలో గల శ్రీ మహాలక్ష్మి పోచమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు సమర్పించారు. గ్రామంలో ఆలయ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు