ఓడ మల్లన్న.. బోడి మల్లయ్య సామెత పై రాజకీయ విశ్లేషణ..

జనసేన ఆవిర్బావ సభ ..

వర్మ రాజకీయ బిక్ష , చంద్రబాబు దయ పవన్ కళ్యాణ్ కు వరం కాదా !

ఓడ మల్లన్న.. బోడి మల్లయ్య సామెత పై రాజకీయ విశ్లేషణ..

మేడా శ్రీనివాస్ అర్పిసి ..


జనసేన ఆవిర్బావ సభ లో నాగబాబు వక్ర మాటలు చంద్రబాబు మదిలో వున్న మంత్రి పదవి ని దూరం చేస్తుందా ! పవన్ కళ్యాణ్ మాదిరి ఉండాలి లేకుంటే పవన్ కళ్యాణ్ వంటి నాయకుని వద్ద ఉండాలి అని నాగబాబు యువతకు సదేశం .. జనం నవ్వి పోతున్నారు నాగబాబు .. పిఠాపురంలో పవన్ గెలుపుకు ఎవరైనా కారణం అనుకుంటే అది వారి ఖర్మ అని నాగబాబు మాటలు పరోక్షంగా వర్మ ను ఉద్దేశించి నట్టుగానే పిఠాపురం ప్రజలు బావిస్తున్నారా ! అంత మాటను భావిస్తున్నట్టే కదా .. సభలో పవన్ మాటలు సైతం సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబు ను అవమానించి నట్టుగా వున్నాయి . పవన్ కళ్యాణ్ కారణం గానే చంద్రబాబు కు అధికారం సాధ్యం అయ్యింది అన్నట్టుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు చంద్రబాబు హృదయాన్ని గాయపరిచినట్టే కదా ! అందులో సందేహం ఎందుకు .. నిజానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పూర్తి స్థాయిలో ఆశీర్వదించక పొతే జగన్ అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు దాటేవారా ! పవన్ కళ్యాణ్ శక్తి ఏమిటో ఒంటరిగా పోటి చేసినప్పుడు తెలిసింది కదా ! మళ్ళీ ఈ పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఓడ మల్లన్నా .. జనసేన ఆవిర్బావ సభలో పవన్ కళ్యాణ్ కు నేడు ఈ స్థాయి గొప్ప స్థానం కల్పించిన వర్మ కృషి కి కనీసం సభ సాక్షిగా కనీసం అభినందనలు తెలపక పోగా అవమానించే రీతిలో అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడటం తెలుగు తమ్ముళ్లను , పిఠాపురం ప్రజలను మనస్థాపానికి గురించేసింది .. బోడి మల్లయ్య … ఎన్నికల సమయంలో నా గెలుపును వర్మ , వారి కుమారుడికి అప్పగిస్తున్నాను అని ప్రాధేయ పడిన పవన్ కళ్యాణ్ నేడు అందుకు భిన్నంగా ప్రవర్తించటం వెనుక కారణం నియోజకవర్గంలో వర్మ కు గల పట్టుకు భపడుతున్నట్టే కదా ! ముమ్మాటికి వర్మ లేకుంటే పిఠాపురంలో 300 ఓట్లు దాటునా ! పవన్ కళ్యాణ్.. నాగబాబు దుందుడుకు మాటలను పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఖండించక పోవటం అనేక అనుమానాలకు కలిగిస్తున్నాయి . పవన్ కళ్యాణ్ పార్టి ని నడుపుతారా ! కూటమిలో పూర్తిగా విలీనం చేస్తారా ! అనే సందేహాలు కలుగుతున్నాయి . 4 దాశాబ్దల తెలుగుదేశం పార్టి ని పవన్ కళ్యాణ్ నిలబెట్టడం ఏమిటి .. మల్లయ్యా అని ప్రస్తుతం ఇదే కామెడీ చర్చ ఊరు ఓడ.. నాగబాబు మాటల వెనుక పవన్ ప్రమేయం లేకపోతుందా ! ఇప్పటికే నెటిజన్లు నాగబాబు మాటలపై విస్తుబోతున్నారు . పవన్ మాటల కామెడి జబర్దస్త్ కామెడీని మర్పిస్తుంది .. ఎవరితో పెట్టుకున్నా మా ఉమ్మడి జిల్లా పిఠాపురం ప్రజలతో పెట్టుకోవద్దు పవన్ కళ్యాణ్ .. లో లోన పిఠాపురం వాసులు గుసగుసలు .. మళ్ళీ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటి చేస్తారా ! నాగబాబు మాటల తోను , పవన్ కళ్యాణ్ చేష్టల తోను పిఠాపురం నియోజకవర్గంపై ఆశలు వదులుకోవటమేనా ! వర్మ మౌనం పవన్ కళ్యాణ్ కు పెద్ద సునామిని తెచ్చి పెట్టటం ఖాయం . ఇప్పుడు ఉన్న పళంగా పిఠాపురం నియోజకవర్గంకు ఎన్నిక పెడితే బారి స్థాయిలో పవన్ కళ్యాణ్ కు ఓటమి తప్పదు . అదే నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటి చేసి గెలిచిన దమ్మున్నోడు వర్మ అంటు స్థానికులు కితాబులు కురిపిస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను వదిలినా, పవన్ కళ్యాణ్ కూటమికి దూరం అయ్యినా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నర్థకమే . ఏది ఏమైనప్పటికి నియోజకవర్గంలో పిఠాపురంలో రాజకీయ బిక్ష పెట్టింది వర్మ అని , ఉప ముఖ్యమంత్రి స్థాయి కల్పించింది చంద్రబాబు అని జనసేన పార్టి వారే అంగీకరించటం విశేషం . అది మరవాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ కు పాత రోజులు తద్యం ..

—మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

  • Related Posts

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా AP: తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్కు చెందిన ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామిజీలు ఆందోళనలు చేస్తున్నారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని, ఇప్పటివరకు నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలిపిరిలో దీక్ష…

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్జిల్లాల్లో బదిలీలు డ్వామా పీడీలకు అప్పగింత ఏలూరు, మంజీరగళం ప్రతినిధి: ఉపాధి సిబ్బంది బదిలీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధి హామీ పథకం డైరెక్టర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్