ఒకే దేశం ఓకే ఎన్నికతో దేశాభివృద్ధి

ఒకే దేశం ఓకే ఎన్నికతో దేశాభివృద్ధి

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- ఒకే దేశం ఓకే ఎన్నిక ఎన్నికతో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రోగ్రాం అధికార ప్రతినిధి పైడిపల్లి గంగధర్, ఓకే దేశం ఓకే ఎన్నిక ప్రోగ్రాం జిల్లా కోకన్వీనర్ చిన్నారెడ్డి అన్నారు. సోమవారం బైంసా పట్టణంలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బిజెపి మండల నాయకులతో కలిసి వర్క్ షాప్ ను నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా పళ్ళు దఫాలుగా ఎన్నికలు రావడంతో ఎలక్షన్ కోడ్ పేరుతో ప్రజాసేవకు ఆటంకం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలో నలుగురు గుమి గూడిన చోట రచ్చబండలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సుస్థిరపాలన అందించాలంటే ఓకే దేశం ఓకే ఎన్నికతోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం మండల కన్వీనర్ గా ఎన్నికైన సాయినాథ్, పట్టణ కన్వీనర్ గా ఎన్నికైన దిలీప్ ను శాలవాతో సత్కరించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్,బైంసా పట్టణ బిజెపి అధ్యక్షులు మల్లేష్, మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ కౌన్సిలర్ గౌతం పింగ్లే,నాయకులు భూమేష్, బండారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే