

ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్
మనోరంజని ప్రతినిధి మార్చి ౦2
ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్ తర్వాత మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేస్తుంటే కిషన్ రెడ్డి, కేసీఆర్ చూడలేకపోతున్నారని మండిపడ్డారు. మోదీ, కిషన్ రెడ్డికి తాము భయపడమని పేర్కొన్నారు