ఎల్లుండే గ్రూప్‌-1 ఫలితాలు..!!

ఎల్లుండే గ్రూప్‌-1 ఫలితాలు..!!

11న గ్రూప్‌-2, 14న గ్రూప్‌-3 జనరల్‌ ర్యాంకుల జాబితా

17న హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ల తుది జాబితా విడుదల

ఫలితాల షెడ్యూల్‌ను ప్రకటించిన టీజీపీఎస్సీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా సంప్రదిస్తే..

99667 00339 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయండి

అభ్యర్థులకు టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం విజ్ఞప్తి

హైదరాబాద్‌, మార్చి 8 రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్స్‌ ఫలితాలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక ప్రకటన చేసింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలతో పాటు గతంలో నిర్వహించిన హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పరీక్ష ఫలితాల తేదీలను శుక్రవారం ప్రకటించింది. ఆ షెడ్యూలు ప్రకారం.. గ్రూప్‌-1 పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రొవిజినల్‌ మార్కుల వివరాలను మార్చి10న ప్రకటించనున్నారు. గ్రూప్‌-2 పరీక్ష జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను 11వ తేదీన, గ్రూప్‌-3 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను మార్చి 14న విడుదల చేయనున్నారు. గతంలో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలను మార్చి 19న ప్రకటిస్తారు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని టీజీపీఎస్సీ విజ్ఞప్తి చేసింది. అన్ని పరీక్షలనూ అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా ఫలితాలు ప్రకటిస్తామని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను ఏంపిక చేయడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నామని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే, అలాంటివారి మాటలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరైనా ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తే.. 99667 00339నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని వెంకటేశం సూచించారు

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం..

    ఈరోజు ఉదయం 9:00 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం.. అసెంబ్లీ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ లో బీసీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో బ్రేక్ ఫాస్ట్ మీట్ నేడు…

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ALERT: నేడు 202 మండలాల్లో వడగాలులు

    ALERT: నేడు 202 మండలాల్లో వడగాలులు