ఎల్ఆర్ఎస్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి.

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి.

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించాలి.

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

(సూర్యాపేట టౌన్, మార్చి 12)

ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను కట్ ఆఫ్ డేట్ గా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు కు హాజరైన అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు తమ యూనియన్ ఆధ్వర్యంలో కలసి వినతి పత్రం అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ కట్ ఆఫ్ డేటు నిర్ణయించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు మాత్రం మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లిస్తేనే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం 2020 వరకు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లకే ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పిందన్నారు. 2020 సంవత్సరం తర్వాత కూడా అనధికార వెంచర్ల ప్లాట్లను రిజిస్ట్రేషన్లు అయ్యాయని వాటికి కూడా ప్రభుత్వం ఎల్లారెస్కు అవకాశం కల్పించాలని కోరారు. పదివేల రూపాయలు చెల్లించి సంవత్సరాలు గడుస్తున్న ఓపెన్ ప్లాట్లు క్రమబద్ధీకరణ కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చెరువుకు ఎఫ్డీఎల్ పరిధి 30 మీటర్ల నుండి 200 మీటర్లకు పెంచుతూ తెచ్చిన జీవోను సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కేటాయించిన భూమిలో పక్క భవనాన్ని నిర్మించి వసతులు కల్పించడంతోపాటు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి శశి కుమార్ టౌన్ ప్లానింగ్ అధికారి ఉయ్యాల సోమయ్య మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు కలెక్టరు జాయింట్ కలెక్టర్ ప్రజలు మేధావులు ఉద్యమకారులు ఎల్ఆర్ఎస్ సదస్సుకు హాజరయ్యారు జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ సూర్యాపేట రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు మాంకాళి ప్రణీత్ జిల్లా ఉపాధ్యక్షుడు sk బాబా ఉయ్యాల నగేష్ గౌడ్ పంతంగి దశరథ గౌడ్ కోతి నాగయ్య వస్తా రవి డాక్యుమెంటు రైటర్ కందిమల్ల మధు భూపాల్ కనకటి మహేష్ బద్దం రాజిరెడ్డి అయితే గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ డాక్యుమెంట్ రైటర్ వీర్లపాటి వెంకన్న డాక్యుమెంట్ రైటర్ తన్వీరు సతీషు మున్సిపాలిటీ అధికారులు భార్గవ్ నాగరాజు మధు చాలామంది తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ల్యాబ్ టెక్నీషియన్ డే ను అధ్యక్షుడు వంశి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు చికిత్సలు ల్యాబ్…

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’