ఎమ్మెల్సీ ఎన్నికలు – మరోసారి కూటమి బలప్రదర్శన !

ఎమ్మెల్సీ ఎన్నికలు – మరోసారి కూటమి బలప్రదర్శన !

ఆంధ్రప్రదే్శ్‌లో జరిగిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులుగా పోటీ చేసిన ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖరం..తిరుగులేని విజయాలు అందుకున్నారు. ఆలపాటి రాజా గెలుపు ఖరారు కాగా.. కౌంటింగ్ ఆలస్యమవుతున్న గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ లో పేరాబత్తుల ఆలపాటి కన్నా ఎక్కువ ఆధిక్యత చూపిస్తూ భారీ విజయం ఖాయం చేసుకుటున్నారు. ఆలపాటి రాజా చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా 80వేలుకు పైగా మెజార్టీ సాధించారు. పేరాబత్తుల కూడా అదే స్థాయిలో మెజార్టీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

పోటీకి దూరంగా ఉన్నా టీడీపీని ఓడిచేందుకు ప్రయత్నిచిన వైసీపీ

చదువుకున్న వాళ్లు ఎవరూ వైసీపీకి ఓటేయరని గతంలోనే అర్థం కావడంతో మా ఓటర్లు వేరే అని వైసీపీ చెప్పుకోవాల్సి వచ్చింది. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ టీడీపీని ఓడించడానికి మాత్రం చాలా ప్రయత్నం చేశారు. గుంటూరు, కృష్ణా పట్టభద్రుల స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు పూర్తి స్థాయిలో అన్ని రకాల సహా సహకారాలు అందించారు. గతంలో ఆయన జగన్ కాళ్లకు నమస్కరిస్తున్న వీడియోలు వైరల్ చేసి మనోడే అని ప్రచారం చేసారు. అయితే అవి ప్లస్ అయ్యాయో.. మైనస్ అయ్యాయో కానీ..గతంలో అరవై వేల ఓట్ల తేడాతో గెలిచిన లక్ష్మణరావు ఈ సారి మాత్రం ఎనభై వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆలపాటి రాజా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో అరవై శాతం ఆలపాటి రాజాకే దక్కాయి.

గోదావరి జిల్లాలోనూ పారని వైసీపీ కుట్రలు

గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మూడు రౌండ్లలలోనే 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీ లభించింది. మొత్తం ఎనిమిది రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి పేరాబత్తుల కూడా.. ఎనభై వేల మెజార్టీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో స్థానంలో వైసీపీ అంతర్గతంగా సపోర్టు చేసిన దిడ్ల రాఘవులు అనే వ్యక్తి ఉన్నారు. ఆయన ఎక్కడో ఉన్నారు. పోలింగ్ రోజు హడావుడి చేసిన హర్షకుమార్ కుమారుడికి కనీస ఓట్లు రాలేదు.

వైసీపీ ఇప్పుడల్లా కోలుకోవడం కష్టమే

కూటమి పార్టీలు ఐక్యంగా పోటీ చేసి భారీ విజయాలను నమోదు చేశాయి. సాధారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇతర సంఘాల వారికి మద్దతుగా ఉంటారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెండు సార్లు పీడీఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణరావు గెలిచారు. అలాంటి చోట టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. గోదావరి జిల్లాలలో కూటమిగా ఉంటే వైసీపీకి కనీసం స్పేస్ ఉండదని మరోసారి నిరూపితమయింది. ఇదే ట్రెండ్ కొనసాగితే వైసీపీ పాతాళంలోకి నెట్టేసిన ప్రజలు పైన సిమెంట్ దిమ్మ కట్టేసినట్లే అనుకోవచ్చు

  • Related Posts

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామివారికి ప్రభుత్వం తరఫున నారా…

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న  నారా లోకేష్ దంపతులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు