ఎన్ హెచ్ ఆర్ సి. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ముక్కెర్ల బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొల్లెద్దు ప్రవీణ్

నియామక ఉత్తర్వులు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

మనోరంజని ప్రతినిధి భువనగిరి : ఫిబ్రవరి 28:- జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా మోత్కూర్ మండలానికి చెందిన ముక్కేర్ల బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన బొల్లెద్దు ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధిగా అడ్డగూడూరు చెందిన మందుల శ్రీకాంత్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఉత్తర్వులు అందించినట్లు జిల్లా ఇన్చార్జి పెదపాటి కర్ణాకర్ రెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బలమైన లీగల్ ప్రొసీజర్ తో, ప్రోటోకాల్ సిస్టంతో ముందుకు పోతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) ఎంతో కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా నియామకమైన బిక్షపతి, ప్రవీణ్ మాట్లాడుతూ తమకిచ్చిన పదవులను ఎంతో బాధ్యతతో నీతి నిజాయితీగా నిర్వహిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థ బలోపేతం కోసం కృషిచేసి అన్ని మండల కమిటీలను పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జంగిటి నరేష్, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి కోమాండ్ల శ్రీనివాస్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు విస్సంపల్లి నగేష్, యాదాద్రి జిల్లాలోని పలువురు సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు. డాక్టర్ మొగుళ్ళ భద్రయ్యకు ఘన స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ కు జిల్లాలోని పలువురు సామాజిక ఉద్యమకారులు, ఆర్టీఐ కార్యకర్తలు స్వాగతం పలికి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి చర్చించారు.

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్