ఎన్నిక ఏదైనా గెలుపు బిజెపిదే : పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

ఎన్నిక ఏదైనా గెలుపు బిజెపిదే : పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

మనరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 04 :తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు బిజెపిదే అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ దుందుబీ మ్రోగించిన మల్క కొమురయ్య గారు విజయం సాధించిన సందర్బంగా షాద్ నగర్ ముఖ్యకూడలిలో బిజెపి పట్టణ అధ్యక్షులు హరిభూషణ్ పటేల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈయొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అందె బాబయ్య గారు పాల్గొనడం జరిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాదాన్యత ఓట్లతోనే విజయం సాధించిన మల్క కొమురయ్య గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్బంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ప్రజలు ఆదరిస్తారు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఫలితాలు ఇలానే ఉంటాయని అన్నారు.పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి కూడ భారీ మెజారిటీ తో గెలువబోతున్నారని అన్నారు. అందె బాబయ్య మాట్లాడుతూ, వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ కు ఇలానే బుద్ది చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా పని చేసి బిజెపి అభ్యర్తులను గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొందుర్గు, కొత్తూరు మండలాల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, అత్తాపూర్ మహేందర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, చెట్ల వెంకటేష్, మల్చలం మురళి, సుధాకర్ అప్ప, బాల్ రెడ్డి, నర్సింలు, కుడుముల బాలరాజ్, రంగన్న గౌడ్, రాము, గట్టొజీ విజయ్, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం.. మనోరంజని,నిజామాబాద్ ప్రతినిధి:: పౌర సరఫరాల శాఖ నిజామాబాద్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డిని ఆర్మూర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు…

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 17 – రాజకీయాలు కలుషిత మయ్యాయో రాజకీయ నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.