ఇవ్వాళ IPL లో డబుల్ ధమాకా

ఇవ్వాళ IPL లో డబుల్ ధమాకా

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 30 – ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రెండు ఆసక్తి కరమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతీయ కాలమానం ప్రకారం మధ్యా హ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది… ఇక రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రాత్రి 7.30 గంటలకు పోటీ పడనున్నాయి.

పాయింట్ల పట్టికలో ఢిల్లీ, హైదరాబాద్

ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. అక్షర్ పటేల్ కెప్టెన్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆ మ్యాచ్‌లో 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది.

మరోవైపు ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. కానీ లక్నో సూపర్ జెయిం ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 మ్యాచ్‌లలో 4 పాయింట్లతో ఆరవ స్థానంలో కొనసాగుతోంది.

గెలుపు కోసం ఎదురుచూస్తున్న రాజస్థాన్ రాయల్స్

ఇక రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి విజయం కోసం ఎదురుచూస్తోంది. రాజస్థాన్ రాయల్స్ సన్‌రై జర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యా చ్‌లలో ఓటమి పాలైంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయ ల్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానం లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియ న్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది, కానీ ఆ తర్వాత రాయల్ ఛాలెం జర్స్ బెంగళూరు చేతిలో 50 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

ఢిల్లీ క్యాపిటల్స్

జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్. ఇంపాక్ట్ ప్లేయర్: అశుతోష్ శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్‌జీత్ సింగ్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా

  • Related Posts

    తెలంగాణకు వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు

    తెలంగాణకు వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు స్వాగత ఏర్పాట్ల పరిశీలనలో పర్యాటకశాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ హైదరాబాద్:ఏప్రిల్ 09తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్​ వరల్డ్​ పోటీలు ఉండాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ అధికారులకు దిశనిర్దేశం…

    నాలుగో ఓటమి చవిచూసినా చెన్నై సూపర్ కింగ్

    నాలుగో ఓటమి చవిచూసినా చెన్నై సూపర్ కింగ్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:ఏప్రిల్ 09ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్,పై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది మూడో విజయం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ