

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే
కృతజ్ఞతలు తెలిపిన ప్రజలకు సంఘం సభ్యులు
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :-
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని రజక సంఘం సభ్యులకు ఇచ్చిన మాటను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ నిలబెట్టుకున్నారు. స్థానిక చాకలి ఐలమ్మ కాలనీలోని రజక సంఘం భవనంలో నీటి అవసరాల కోసం బోరును వేయించారు. ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు ఇచ్చిన మాట నెరవేర్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కోరిపోతన్న, పిఎసిఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు దేవోజి భూమేష్, నాయకులు తాటివార్ రమేష్, బత్తినోళ్ల సాయినాథ్, రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు