ఆశ వర్కర్స్ పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితున్ని కఠినంగా శిక్షించాలి.

ఆశ వర్కర్స్ పై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితున్ని కఠినంగా శిక్షించాలి.

సిఐటియు మల్కాజిగిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగ్ రావు

మనోరంజని ప్రతినిధి జగిత్యాల మార్చి 07 :- జగిత్యాల జిల్లా రాయికల్ లో దళిత మహిళ, ఆశా వర్కర్స్ శివరాత్రి రోజున విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న సందర్భంలో ఒక వ్యక్తి ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని సిఐటియు మల్కాజ్గిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు తెలియజేశారు. ఈ సందర్భంగా బంగారు నర్సింగరావు మాట్లాడుతూ ఘటన జరిగి వారం రోజులు అయినా ఇప్పటివరకు అత్యాచారానికి పాల్పడ్డ నిందితుని అరెస్టు చేయకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. నిందితున్ని అరెస్టు చేయడంలో విఫలమైన జగిత్యాల జిల్లా డిఎస్పీని మరియు సంబంధిత పోలీస్ అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేయాలి. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అత్యాచారానికి ఒడిగట్టిన నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వము మరియు పోలీసు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలపై జరుగుతున్న దాడులకు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలను నిర్వహించి చట్ట ప్రకారం నష్టపరిహారం అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మల్కాజ్గిరి మండల నాయకులు కే. యాదగిరి, ఎం. కృష్ణమ్మ, చిట్టి బాయ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు.. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు, ధరించిన ఆ దుండగుడు అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను…

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ. నియామక ఉత్తర్వులు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య కామారెడ్డి టౌన్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    ఉస్మానియా వర్సిటీలో ఆందోళనలు.. రిజిస్ట్రార్ ఏమన్నారంటే..

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    రాజాసింగ్ ఎపిపోడ్‌.. కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.

    ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.