అసెంబ్లీ సీట్ల డీలిమిటేన్ కావాలి – తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

అసెంబ్లీ సీట్ల డీలిమిటేన్ కావాలి – తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ వద్దని.. కానీ తెలంగాణలో మాత్రం అసెంబ్లీ సీట్లను పెంచాలని శాసనసభలో తీర్మానం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్ సభలో డీలిమిటేషన్ చేపడితే రాష్ట్రాల మధ్య వైషమ్యాలు వస్తాయని అన్ని పార్టీలతో సంప్రదింపులు చేసిన తర్వాత ప్రక్రియ చేపట్టాలని తీర్మానం చేశారు. గతంలో పాతికేళ్ల వరకూ లోక్ సభ సీట్లను మార్చకుండా రాజ్యాంగ సవరణ చేశారని..ఇప్పుడు కూడా అలా చేయాలని తీర్మానంలో కోరారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రమంత్రులు చెబుతున్నారు. అందుకే ఈ సభలో తీర్మానం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చట్టాలను పక్కగా అమలు చేశాయని కానీ ఉత్తరాదిలో మాత్రం జనాభా పెరిగిందన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను భాగస్వాములతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాస్వామ్యవాదులతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని, పార్లమెంటరీ నియోజకవర్గాపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, తాజా జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్యను మాత్రం వెంటనే 119 నుంచి 153కి పెంచాలని అసెంబ్లీ తీర్మానించింది. దీని కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఎంపీ సీట్లు మార్చకుండా.. అసెంబ్లీ సీట్లే మార్చాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేయడం కాస్త భిన్నంగా ఉంది

  • Related Posts

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై…

    శ్రీరామనవమి శోభా యాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్‌ సిటీ: ఏప్రిల్ 04 :-నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కన్నుల పండుగగా శ్రీరాములోరి కళ్యాణ మహోత్సవం.

    కన్నుల పండుగగా శ్రీరాములోరి కళ్యాణ మహోత్సవం.

    ఆలూరు లో హనుమాన్ చాలీసా పుస్తకాల పంపిణీ.

    ఆలూరు లో హనుమాన్ చాలీసా పుస్తకాల పంపిణీ.

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    ఆర్థిక సహాయాన్ని అందజేసిన

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు

    వక్ఫ్ బిల్లు ఆమోదంపై మోడీ కీలక వ్యాఖ్యలు