

అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే
ఫిన్ టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఫోన్ పే మరో మైలురాయికి చేరుకున్నది. తాజాగా 60 కోట్ల మంది కంపెనీ సేవలు పొందుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు ప్రారంభించి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఈ కీలక రికార్డును సొంతం చేసుకోవడం విశేషమని కంపెనీ కో-ఫౌండర్, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. గతపదేండ్లలో సంస్థ అన్నిరంగాల్లో సేవలు అందిస్తున్నదని, ముఖ్యంగా హెల్త్ మేనేజ్మెంట్, ఈ-కామర్స్ వంటి విభాగాలు కూడా ఉన్నాయన్నారు.