

అడెల్లి ఆలయం వద్ద బహిరంగ వేలం.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 11 – నిర్మల్ జిల్లా – సారంగపూర్: మండలంలోని అడెల్లి పోచమ్మ అలయంవద్ద ఒడి బియ్యం,చీరెలు,కనుమలు ప్రోగు చేసుకొనుటకు ఈ నెల 18 మంగళవారం ఉదయం 11 గంటలకు ఆలయ ఆవరణలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ ఓ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ లీజు హక్కు తేది 21/04/2025 నుండి 20/04/2026 వరకు ఒక సంవత్సరం పాటు ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు సకాలంలో వచ్చి వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరారు.
