

హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రముఖులు
మనోరంజని ప్రతినిధి మార్చి 14 :- నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శుక్రవారం హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగను పురస్కరించుకొని బైంసా పట్టణంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు జి విట్టల్ రెడ్డి, నారాయణరావు పటేల్, ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ సహితం వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు ప్రముఖులకు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. ప్రముఖుల నివాసాలు కార్యకర్తలు- నాయకులతో సందడిగా మారాయి. మండల స్థాయిలో సైతం హోలీ పండుగ సందడి నెలకొంది. వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సంబరాల్లో పాల్గొన్నారు


