హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పోసాని కృష్ణమురళి

జైలు నుంచి పోసాని విడుదల అవుతారనుకుంటున్న తరుణంలో ట్విస్ట్

పోసానిపై పీటీ వారెంట్ వేసిన గుంటూరు సీఐడీ పోలీసులు

పీటీ వారెంట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పోసాని

సినీ నటుడు పోసాని కృష్ణమురళి కేసుల వ్యవహారంలో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ పోలీసులు వేసిన పీటీ వారెంట్ ను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. పోసాని తరపున వైసీపీ రాష్ట్ర లీగల్ వ్యవహారాల కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విచారణ చేపట్టనుంది. పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై పోసానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అన్ని కేసుల్లో ఆయనకు కోర్టులు రిమాండ్ విధించాయి. మరోవైపు అన్ని కేసుల్లో బెయిల్ కూడా మంజూరయింది. జైలు నుంచి పోసాని విడుదలవుతారని భావిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో ఆయన విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే పీటీ వారెంట్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు

  • Related Posts

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ ! రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి.. కానీ అవకాశాలు సృష్టించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు, వైసీపీ అధినేత జగన్ కు ఓ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

    ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..