హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

దయనీయంగా మారిన హెల్త్ అసిస్టెంట్ల జీవన పరిస్థితులు

మనోవేదనతో మరణించిన ఏడుగురు హెల్త్ అసిస్టెంట్లు

సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి

మనోరంజని ప్రతినిధి విశాఖపట్నం మార్చి 18 – కోర్టుల్లో కేసుల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నుండి తొలగించిన 920 మంది కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే వీధుల్లోకి తీసుకోవాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. వైజాగ్ లో సురేష్ బాబు సంఘ ప్రధాన కార్యదర్శి లింగాల రవీంద్ర బాబుతో కలిసి మాట్లాడుతూ కోర్టులో కేసులు వివాదాలు,విద్యార్హతలు,మెరిట్ లిస్టు సమస్యలతో 22 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది హెల్త్ అసిస్టెంట్లను తొలగించడం వల్ల వారి జీవన పరిస్థితులు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన ఉద్యోగులులో చాలామంది 50 సంవత్సరాలు పైగా వయసు కలిగిన వారు ఉన్నారని,వాళ్లంతా పలు రకాల కుటుంబ,ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఉద్యోగాల నుండి తొలగించడంతో మనోవేదనతో ఏడుగురు హెల్త్ అసిస్టెంట్లు మరణించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల నుండి తొలగించి మూడు నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు సమస్య పరిష్కారంపై స్పష్టత లేకపోవడం వల్ల హెల్త్ అసిస్టెంట్లు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకొని ,వాళ్లకు మూడు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.సమస్య పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవాలని సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు.

  • Related Posts

    విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపు !

    విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపు ! అధికారం ఉంది కదా ప్రతీ దానికి వైఎస్ఆర్ పేరు తగిలించుకున్నారు నాటి ప్రభుత్వ పెద్దలు. ఇప్పుడు వాటిని తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేకపోయినా వివిధ సంస్థలకు…

    20-03-2025 / గురువారం / రాశి ఫలితాలు

    20-03-2025 / గురువారం / రాశి ఫలితాలు మేషం పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహమున సంతాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ