హంటర్ కు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు

హంటర్ కు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు

జిల్లా పోలీసుశాఖకు విశేష సేవలందించిన ”hunter” (జాగిలం) అనారోగ్యంతో మృతి.

ఘననివాళి అర్పించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐ.పి.ఎస్.

పలు హత్య, దొంగతనాల కేసులను ఛేదించడంలో ”హంటర్” విశేష ప్రతిభ.

మనోరంజని ప్రతినిది నిర్మల్ మార్చి 14 :- నిర్మల్ జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలందించిన ‘హంటర్’ అనే జాగిలం అనారోగ్యంతో మృతి చెందింది. నుంచి ‘హంటర్’ పలు నేర కేసుల్లో కీలక పాత్ర వహించిందని ఎస్పీ తెలిపారు. గురువారం మధ్యానం అనారోగ్యంతో మృతి చెందగా.. జిల్లా పోలీసు కార్యాలయంలో ‘హంటర్’ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా పోలీసు శాఖకు ‘హంటర్’ చేసిన సేవలు వెలకట్టలేనివని.. చిరస్మరణీయమైన సేవలు అందించిందని ఎస్పీ కొనియాడారు. జాగిలం మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు పోలీసు అధికారులు, సిబ్బంది మౌనం పాటించారు. బెల్జియం మలినోస్ జాతికి చెందిన జాగిలం ‘హంటర్’ మార్చ్ 11, 2021న జన్మించింది. రంగారెడ్డి జిల్లాలోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్ ఐఐటీఎ మొయినాబాద్‌లో 8 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి, నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో ఫిబ్రవరి 01, 2022 నుంచి నేర విభాగంలో విధులు నిర్వర్తిస్తు, VIP, VVIP బందోబస్తులో విధులు నిర్వర్తిస్తు, పలు హత్య, దొంగతనాల కేసులను ఛేదించడంలో ‘హంటర్’ ప్రతిభ కనబరిచింది. విధి నిర్వహణలో మాత్రమే కాకుండా పలు జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొని ప్రతిభ చాటింది. ‘హంటర్ కు పోలీసు లాంఛనాలతో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ మీన ఐపిఎస్, ఇన్స్పెక్టర్ లు ప్రేమ్ కుమార్, కృష్ణ, ఆర్ఐలు రాంనిరంజన్, శేఖర్, రమేష్, ఎస్ఐ లింబాద్రి, ఆర్.ఎస్ఐ లు, జాగిలంల సంరక్షకులు, ఇతర పోలీస్ సిబ్బంది వున్నారు

  • Related Posts

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్ TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా…

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

    సోషల్ మీడియాలో ప్రేమ.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్(18)కు.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత(20)కు మధ్య సామాజిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్