స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు విజేందర్ రెడ్డితో కలిసి చిట్యాల రామచంద్రంకు ఘన నివాళులు

మనోరంజని ప్రతినిధి పాలకుర్తి/ మార్చి 13 :- జనగామ జిల్లా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) కుటుంబాన్ని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, సామాజికవేత్త, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు దొంతి విజేందర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఇటీవల ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం గారు పరమపదించగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రామచంద్రం కొడుకు సంపత్ ఇటీవల ప్రమాదంలో గాయపడగా ఆరోగ్యం గురించి వాకబు చేసి మనోధైర్యంగా ఉండాలని సూచించారు. కోడలు శ్వేతఐలమ్మను ఓదార్చారు. 20 సంవత్సరాలుగా రామచంద్రం పాలకుర్తి గ్రామ సర్పంచ్ గా నిస్వార్ధంగా, నిజాయితీగా సేవలు అందించడం గొప్ప విషయం అని వారు గుర్తు చేశారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన సంపత్- శ్వేతఐలమ్మల కుటుంబ దీనపరిస్థితి చూసి చలించారు. ఇటీవల తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించిన శ్వేతఐలమ్మను అధికారికంగా నియమించి తెలంగాణ తల్లి, త్యాగమూర్తి చాకలి ఐలమ్మ కుటుంబానికి తగిన గౌరవం, గుర్తింపు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగారికి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య విజ్ఞప్తి చేశారు. శ్వేతఐలమ్మ- సంపత్ ల పరిస్థితిని గౌరవ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు దొంతి విజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి కోమాండ్ల శ్రీనివాస్, జనగామ జిల్లా ఇన్చార్జి బస్కే నాగరాజు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు విసంపెల్లి నగేష్, సోషల్ మీడియా టీం సభ్యులు ఎం రాజేందర్, గణేష్, మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

స్పందించిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు విజేందర్ రెడ్డి ద్వారా పూర్తి సమాచారం తెలుసుకున్న గౌరవ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి స్పందించారు. ఐలమ్మ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని, రామచంద్రం గారి కర్మలకు సంబంధించిన అన్ని ఖర్చులు భరిస్తామని తగిన ఏర్పాట్లకు పూర్తి ఆదేశాలు ఇచ్చారని, అలాగే ప్రమాదంలో గాయపడిన సంపత్ ఆరోగ్యానికి మెరుగైన వైద్యం కోసం పూర్తి సహకారం అందిస్తామని, ముఖ్యమంత్రిని కలిసి శ్వేతాఐలమ్మకు మహిళా కమిషన్ సభ్యురాలి నియామక విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారని విజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మానవతా హృదయంతో స్పందించి తగు ఏర్పాట్లకు ఆదేశాలు ఇచ్చిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గొప్పమనసుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

  • Related Posts

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    “రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు” సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో,…

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలుహోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు