సోషల్ మీడియాలో హద్దులు మీరుతున్న జర్నలిస్టులు: సీఎం రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో హద్దులు మీరుతున్న జర్నలిస్టులు: సీఎం రేవంత్ రెడ్డి

జర్నలిస్టు ముసుగులో ఉన్న వారిని గుడ్డలూడదీసి రోడ్ల మీద తింపిస్తా

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 15 – సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చూస్తూ.. ఊరుకోన ని,సీఎం రేవంత్ రెడ్డి, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజా జీవితంలో ఉన్నందు న ఓపిక పడుతున్నానని ఆయన అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారని ఆయన హెచ్చరించారు. ఎవరి పడితే వాళ్ళు ఛానల్ పెట్టుకుని ఇష్టాను రాజ్యాంగ మాట్లాడితే వాళ్లు జర్నలిస్టులు అవుతారా? అని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో హద్దు మీరుతున్న వారిని బట్టలూడదీసి రోడ్లమీద తిప్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,హెచ్చరిచారు. జర్నలిస్టు రేవతి,అరెస్టు విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై సీఎం మండిపడ్డారు. ఇవాళ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీస్ లోనే పెట్టి వీడియోలు రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు పెటితే వాటిపై పోలీసులు కేసు పెట్టి ఇద్దర్ని అరెస్టు చేశారు. దానికి బీఆర్ఎస్ నేతలకు దుఃఖం వస్తుంది. సోషల్ మీడియాలో వాళ్లు పెట్టిన భాష ఓ సారి వినండి. జర్నలిస్టుల ముసుగులో మమ్మల్నీ మా ఇంట్లోని మహిళలపై ఇష్టారీతిలో తిట్టిస్తున్నారని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ఆ భాష వింటే రక్తం మరుగుతుంది. కుటుంబ సభ్యులను అం తేసి మాటలు అంటుంటే మీరసలు మనుషులేనా? మీకు భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, మీ చెల్లినో, మీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే మీరు వింటా రా? అని ప్రశ్నించారు. నా భార్య, బిడ్డను తిటుతుంటే నాకు నొప్పి అవుతుంది. కానీ ఓ ఆడబిడ్డను అవమానిస్తుంటే మీకు నొప్పికాదా? ఏ సంస్కృతి లో ఉన్నారు. ముఖ్య మంత్రిగా చెబుతున్నా.. ఒక్కొక్కరి తోడ్కలు తీస్తా. రాజకీయ జీవితంలో ఉన్నది మేము మమ్మల్ని విమర్శించండి. మా పని తీరుపై ప్రశ్నించండి అన్నారు.. ఆ రకమైన భాషను ఆడపిల్లలే రికార్డు చేయించి తమ ప్లాట్ ఫామ్ లపై పోస్టులు చేస్తే ఇది మంచి పద్దతా అని నిలదీశారు. ఇలాంటి వారు కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకుం టామనుకుంటున్నారేమో అవసరం అయితే చట్టాన్ని సవరిస్తామన్నారు. వీటిని క్షమించే ప్రసక్తే లేదని, ఉక్కుపాతరేస్తామని హెచ్చరించారు.

  • Related Posts

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం.. మనోరంజని,నిజామాబాద్ ప్రతినిధి:: పౌర సరఫరాల శాఖ నిజామాబాద్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డిని ఆర్మూర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు…

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 17 – రాజకీయాలు కలుషిత మయ్యాయో రాజకీయ నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.