వేసవిలో రైతులకు సాగునీరు అందిస్తాం

వేసవిలో రైతులకు సాగునీరు అందిస్తాం

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 11 :- వేసవిలో రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం కడెం మండలం కొత్తమద్దిపడగ గ్రామ శివారు పంట పొలాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు సాగు చేసిన పంటలకు సంబంధించి వివరాలను రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతులు సాగు చేసిన పంటలకు కడెం ప్రాజెక్టు సదర్మాట్ కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు అవసరమైన మేరకు నీటిని అందిస్తామని తెలిపారు. సాగునీటి విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందనవసరం లేదన్నారు. ప్రతి పంట పొలానికి ఏప్రిల్ చివరినాటికీ సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, నీటిపారుదల శాఖ ఈఈ విట్టల్, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!! కులాలు, మతాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా నిర్వహించుకునే పండుగల్లో హోలీ(Holi Festival) ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆరోజున ఉత్సాహంగా…

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.