రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు..!!

రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు..!!

హైదరాబాద్:అసెంబ్లీలో మూడోసారి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతులకు ఏడాదికి ఎకరానికి 12 వేల రూపాయలు అందుతాయని ఈ సందర్భంగా భట్టి తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి.. రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద పీట వేసింది. వ్యవసాయ శాఖకు బడ్జెట్లో 24 వేల 439 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో మూడెకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే. రూ.1,230.98 కోట్లను రైతుల అకౌంట్లలో వేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్ల రైతు భరోసా నిధులు అందాయి. జనవరి 26న పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి రూ.568.99 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్న 17 లక్షల మంది రైతులకు చెందిన 9.29 లక్షల ఎకరాల భూమికి గాను రూ.557.54 కోట్లు జమ చేశారు. రెండెకరాల వరకు ఉన్న రైతులకు ఫిబ్రవరి 10న 13.23 లక్షల మందికి, ఫిబ్రవరి 12న రికార్డులు అప్‌డేట్ చేసిన 56 వేల మంది రైతులకు రూ.38.34 కోట్లతో కలిపి మొత్తం రూ.1,130.29 కోట్లు నిధులు జమ చేశారు. అదే రోజు మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మంది రైతులకు చెందిన 20.51 లక్షల ఎకరాలకు రూ.1,230.98 కోట్లు నిధులను డైరెక్ట్ బెనిఫీషియరీ ట్రాన్స్‌ఫర్ ద్వారా రైతు ఖాతాల్లో వేశారు. దీంతో ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద రూ.3,487.82 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. మిగతా వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్లో రైతు భరోసాకు 18 వేల కోట్లు కేటాయించడంతో రేపోమాపో రైతు భరోసా అర్హులైన లబ్దిదారులకు అందనుంది.

  • Related Posts

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 22 :- పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదర స్కూల్ కరెస్పాండెంట్లకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు…

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా పంట నష్టం కలిగించాయి. కరీంనగర్ రూరల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

    ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

    నగునూరులో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

    రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..

    రెండు పాములు 80 పాము పిల్లలు మార్కాపురంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన..

    డీలిమిటేషన్ ప్రభావంపై దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

    డీలిమిటేషన్ ప్రభావంపై దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం