

రాజీవ్ యువ వికాసం పథకం లో ఎస్సీ,ఎస్టీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 24 – నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యాలయంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లోకల్ బాడీస్ అథారిటీస్ కీ వినతి పత్రం ఇవ్వడం అయినది. “రాజీవ్ యువ వికాసం ” పథకం గురించి నిరుద్యోగ యువత కీ జీవన ఉపాధిని పెంపొందించే ఈ పథకంలో నిజామాబాద్ జిల్లా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగల (ఎస్సీ ,ఎస్టీ) కు చెందిన నిరుద్యోగ యువతి,యువకులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ నిజామాబాద్ జిల్లా కమిటీ , మీడియా ఇంచార్జీ, కట్టా నరేశ్ కుమార్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని ఆదివాసుల కుటుంబాల అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్న ఆదివాసులకు అందడం లేదని కావున దయచేసి అధికారులు ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల గురించి ఆదివాసులు గ్రామాల్లో అవగాహన సదస్సులు కార్యక్రమాలు ఏర్పాటుచేసి రాజీవ్ యువ వికాసం పథకం యొక్క విధివిధానాలను వివరిస్తూ ఎస్సీ ఎస్టీ ప్రజలకు అవగాహన పెంపొందించి వారి జీవన అభివృద్ధికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు అలాగే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి న క్షేత్రస్థాయిలో అందడం లేకుండా ఇంకా వెనుకబడి పోయారు కావున తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎస్సీ ఎస్టీలకు చెందవలసిన పథకాలను పనులను సత్వరమే వారికి చెందే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి స్థానిక అధికారుల తో ఎస్సీ, ఎస్టీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ తెగలకు చెందిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు, మీడియా ఇంచార్జీ కట్టా నరేష్ కుమార్ నాయక్, జర్నలిస్టు, శ్రీనివాస్ , గంగాధర్, మోపాల్ మండల ఇన్చార్జి ఎఱ్ఱ్రం నాగేష్, పల్లె ప్రభుదాస్, నిజామాబాద్ రూలర్ ఇంచార్జ్,అన్నం మహేష్, ఎఱ్ఱ్ఱం, ఎడ్ల గంగా ప్రసాద్,సాయిలు, రవికుమార్, సమాద్ బాయ్, సయ్యద్ ఖదీర్, రాజు కుమార్,నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు